Header Banner

ఈదురు గాలులు వచ్చేస్తున్నాయి! అప్రమత్తంగా ఉండండి! ఎక్కడెక్కడ అంటే!

  Wed Apr 30, 2025 09:12        Others

ఏప్రిల్ నెల ముగుస్తున్న తరుణంలో ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉంది. భారీ ద్రోణి కొనసాగుతోంది. అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గాలి వేగం బాగా ఉంటుంది. ఈదురు గాలులు వీస్తాయి. ఇవాళ ఎక్కడెక్కడ వర్షం కురుస్తుందో తెలుసుకుందాం.

 

భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులిటెన్ ప్రకారం.. బంగ్లాదేశ్ పైన గాలితో కూడిన సుడి ఒకటి తిరుగుతోంది. అలాగే.. మధ్య ప్రదేశ్‌పై మరో సుడి ఉంది. ఒక ద్రోణి మధ్య ప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ ఉంది. మరో ద్రోణి విదర్భ నుంచి కేరళ వరకూ ఉంది. ఈ పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో వారం పాటూ వర్షాలు పడతాయి అని IMD చెప్పింది.

 

ఇవి నైరుతీ రుతుపవనాల వల్ల పడుతున్న వర్షాలు కావు. అకాల వర్షాలు అందువల్ల మేఘాలలో రాపిడి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారం పాటూ పిడుగులు కూడా పడతాయని IMD చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందనీ, ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్లు కూడా ఉంటుందని తెలిపింది.

 

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 


శాటిలైట్ లైవ్ ప్రకారం.. ఇవాళ (బుధవారం ఏప్రిల్ 30, 2025) ఏపీ, తెలంగాణలో రోజంతా మేఘాలు ఉంటాయి. తెలంగాణలో ఉదయం వేళ హైదరాబాద్ పరిసరాల్లో జల్లులు కురుస్తాయి. సాయంత్రం 4 తర్వాత మళ్లీ హైదరాబాద్ పరిసరాల్లో వర్షం మొదలవుతుంది. అది జల్లుల రూపంలో కురుస్తుంది. ఐతే.. ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ లేదు. వాతావరణం మాత్రం మేఘాలతో ఉంటుంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ రోజంతా మేఘాలు ఉంటాయి. రాయలసీమ, కోస్తాలో వర్షం పడకపోయినా కొంత వేడి తగ్గుతుంది. ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. ఏప్రిల్ 29న రాత్రి భారీ వర్షం కురిసింది. ఏప్రిల్ 30న కూడా.. సాయంత్రం 3 గంటల తర్వాత నుంచి మోస్తరు వర్షం మొదలై.. భారీగా కురుస్తుంది. మధ్య మధ్య గ్యాప్ ఇస్తూ అర్థరాత్రి సమయంలో భారీ వర్షం పడుతుంది.

గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 20 కిలోమీటర్లుగా ఉంది. అక్కడి నుంచి గాలి ఏపీలోకి వస్తోంది. ఏపీలో గాలి వేగం గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్లుగా ఉంటుంది. వర్షం పడే ముందు ఈదురు గాలులు వస్తాయి. అవి చాలా బలంగా ఉంటాయి. వాటితో అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల్లో వారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

ఉష్ణోగ్రతలు చూస్తే, ఏపీలో యావరేజ్‌గా 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఐతే.. రాయలసీమలో కొన్ని చోట్ల 39 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో యావరేజ్ 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వాయవ్య తెలంగాణలో కొన్ని చోట్ల 41 డిగ్రీల సెల్సియస్ కూడా ఉంటుంది. మేఘాలు ఉన్నా.. అప్పుడప్పుడూ ఎండ బాగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు పాటించాలి.

 


తేమ ఏపీ, తెలంగాణలో 40 శాతం దాకా ఉంది. సాయంత్రం తర్వాత తెలంగాణలో తేమ 50 శాతం దాటుతుంది. ఏపీలో 80 శాతం దాటుతుంది. మొత్తంగా ఇవాళ తెలంగాణలో కొంత వాన తక్కువగానే ఉన్నా.. మేఘాలు బాగానే ఉంటాయి. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో భారీ వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో మేఘాలు ఉంటాయి.

 


ఇవాళ్టితో ఏప్రిల్ ముగుస్తుంది. ఈ నెలలో ఎండలు బాగానే ఉన్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అవి కొంత ఉపశమనం కలిగించాయి. మే నెల కూడా వర్షాలు బాగానే కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హిందూ మహా సముద్రం, ఆగ్నేయ ఆసియాలో మేఘాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పాలంటే బంగాళాఖాతంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అవి మన ఏపీ, తెలంగాణలో కురిస్తే, ఎండ ఉండేదే కాదు. వచ్చే 10 రోజుల వరకూ వర్షాలు కురిసేందుకు కావాల్సినన్ని మేఘాలు పోగై ఉన్నాయి. అందువల్ల మే నెలలో కూడా వర్షాలు కురుస్తాయని అనుకోవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #RainAlert #TelanganaRains #AndhraWeather #HeavyRainfall #StrongWinds